అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డైరెక్టర్ సుకుమార్ నిన్నటి రోజున సందడి చేయడం జరిగింది.. తన చిన్ననాటి స్నేహితుడు రాంబాబు ఇంట్లో సతీమణితో కలిసి సరదాగా గడపడం జరిగింది.. సుకుమార్ బెస్ట్ ఫ్రెండ్ పంచాయతి రాజు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రాంబాబు ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సుకుమార్ తెగ సందడి చేశారు సుకుమార్ దంపతులకు కోనసీమ రుచులను కూడా చూపించడం జరిగింది స్నేహితుడు రాంబాబు. ఇలాంటి సమయంలోనే పుష్ప సినిమా షూటింగ్ అప్డేట్ ను కూడా రివీల్ చేసినట్లు తెలుస్తోంది.



ఈనెల 27 నుంచి 29 వరకు పుష్ప సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరగబోతుందని ఇదే షెడ్యూల్ లో విలన్ పై చిత్రీకరణ ఉంటుందని తెలియజేశారు. కోనసీమ మట్టుపర్రు గ్రామ వాసి అయిన సుకుమార్ చాలా కాలం తర్వాత కోనసీమలో తన భార్యతో కలిసి అడుగుపెట్టారు. దీంతో ఇలా తమ ఇంటికి తన స్నేహితుడు రావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా రాంబాబు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప-2 సినిమా చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించక రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.


ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను విడుదల చేయడం జరిగింది ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతోపాటు ఈ సినిమాకు మరింత హైప్ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇందులో కీలకమైన పాత్రలో సునీల్ అనసూయ నటిస్తూ ఉండగా విలన్ గా ఫహాద్ ఫాజిల్ నటిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.. తాజా అందిన సమాచారం ప్రకారం ఇందులో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కీలకమైన పాత్రలు నటించబోతున్నట్లు సమాచారం ఇందులో ఆయన పాత్ర మరింత హైలెట్గా ఉంటుందని.. పుష్పరాజును పోలీసులకు ఇంటర్వ్యూస్ చేసే పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: