హనీ రోజ్ఈ  పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల విడుదలైన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులారీటీని సంపాదించుకుంది ముద్దుగుమ్మ.కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు హీరోగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ముందు వరకు హనీ రోజ్ ఎవరు అన్నది చాలామందికి తెలియదు.ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

ఇది సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు.

అవకాశాలు రాకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.ఇటీవల కాలంలో వరుసగా బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.ఈ ముద్దుగుమ్మను అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు కూడా అంతే మంది ఉన్నారు.

తనపై నెగటివ్ కామెంట్స్ చేసేవారికి ఎప్పటికప్పుడు తనదైన శైలిలో దిమ్మతిరిగే రేంజ్ లో కౌంటర్స్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హనీ రోజ్ తాను కూడా బాడీ షేమింగ్ కామెంట్స్, ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు తెలిపింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ఎప్పుడూ ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తాయి.

మరికొన్ని మాత్రం మనసుకు బాధ కలిగిస్తాయి.నా శరీరాకృతి గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంటే చాలా బాధేసేది.ఇప్పుడిప్పుడే అలాంటివాటిని పట్టించుకోవడం మానేయడానికి ప్రయత్నిస్తున్నాను.నేను ఒక టీవీ షోకు వెళ్లినప్పుడు అక్కడ ఒక కమెడియన్ నన్ను బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు.ఆ మాటలు విని యాంకర్ గట్టిగా నవ్వింది.మహిళా యాంకరే నా మీద వస్తున్న కామెంట్స్ విని నవ్వడం నచ్చలేదు.అతను బాడీ షేమింగ్ చేస్తుంటే టీవీలో ఎలా ప్రసారం చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది హనీ రోజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: