ఇప్పటివరకు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో లో పేటీఎం, ఫోన్ పే ,గూగుల్ పే , అమెజాన్ పే వంటి వాటిని  మాత్రమే చూశాము. కానీ ఇప్పుడు సరికొత్తగా మనీ ట్రాన్స్ఫర్ విభాగంలోకి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా అడుగుపెట్టబోతోంది.. ఇక ట్విట్టర్ ఫ్లాట్ఫామ్ ద్వారా డబ్బులను బదిలీ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక ఇందుకోసం ప్రత్యేకంగా టిప్ జార్ అనే ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే టిప్ జార్ అనే ఆప్షన్ ను ట్విట్టర్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ ఫీచర్ ను అమెరికాలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక ఇప్పటికే క్రియేటర్స్ పేరుతో కొంతమంది జాబితాను ట్విట్టర్ సిద్ధం చేసింది. ఇది ట్రైల్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది సంస్థ. ఇక దీని ద్వారా క్రియేటర్స్ లిస్టులో ఎవరైతే యూజర్లు ఉన్నారో, వారు మాత్రమే డబ్బులు పంపించేందుకు వీలు కల్పిస్తోంది. ఇందులో ముఖ్యంగా జర్నలిస్టులు, ఎక్స్పర్ట్ లు  నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, కంటెంట్ క్రియేటర్స్, మ్యూజిక్ క్రియేటర్స్ మాత్రమే ఉంటారు. ఇక అంతే కాకుండా పిక్చర్ ఫంక్షన్ అందుబాటులో ఉన్న ప్రొఫైల్స్ కి ,ఒక ప్రత్యేకమైన ఐకాన్ ని కూడా ఆడ్ చేయడం జరుగుతుంది.. ఇలా యాడ్ చేసిన వారికి మాత్రమే ఇతరులు డబ్బులు పంపగలుగుతారు.



ఇక అమెరికాలో బాగా పేరొందిన సర్వీస్ సంస్థలైన పేపాల్ ,వెన్మో, క్యాష్ యాప్ లాంటి సర్వీసుల నుంచి డబ్బులు పంపే అవకాశం ఉంటుంది. ఇక ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు, ఐ ఓ ఎస్ మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత డెస్క్ టాప్ యూజర్లకు అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. ఇక కంటెంట్ క్రియేటర్ లుగా, ట్విట్టర్ ఎంపిక చేసిన వారికి యూజర్లు తమకు నచ్చిన అంత డబ్బు రూపంలో పంపవచ్చు. ఇక నచ్చితే దీని ద్వారా టిప్స్ ను కూడా పంపించవచ్చు. ఏది ఏమైనా ట్విటర్ కూడా నగదు బదిలీ చేసే ప్లాట్ఫాం మీదకు రావడం అందరికీ మరింత సులభతరం అవుతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: