రైతులకు శుభవార్త తెలిపిన మోడీ ప్రభుత్వం.. మోడీ ప్రభుత్వం అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు, ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలలో అత్యంత ప్రావీణ్యం పొందిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 2018 వ సంవత్సరంలో ఈ స్కీంను అన్నదాతల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రైతుల ఆర్థిక సమస్యలు తీర్చేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా త్వరలోనే అన్నదాతల ఖాతా లో కొంత డబ్బు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ స్కీమ్ వల్ల చాలామంది రైతన్నలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఎనిమిది విడతల వారీగా పీఎం కిసాన్ స్కీం ద్వారా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలను జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తొమ్మిదవ విడతగా ఆగస్టు నెలలో రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలను జత చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఏడాదికి మూడు విడతల చొప్పున, ఒక్కో విడతలో రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసిన విషయం తెలిసిందే.
ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రతి సంవత్సరానికి రైతుల ఖాతాలోకి మోడీ ప్రభుత్వం ఆరు వేల రూపాయలను జమ చేస్తోంది. ఇప్పటికే ఈ స్కీం లో చేరని వారుంటే, పీ ఎమ్ కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ తమ ఖాతాల్లో 6 వేల రూపాయలను సంవత్సరానికి మూడు విడతలుగా జమ చేయడం గమనార్హం. మీ ఊరి గ్రామ పంచాయతీ కి వెళ్లి పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా పీఎం కిసాన్ స్కీమ్ లో చేరి మోడీ ప్రభుత్వం వచ్చే ఆరు వేల రూపాయలను ఉచితంగా పొందవచ్చు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి