ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో వసతి దీవెన పథకం కూడా ఒకటి. ఇక ఎప్పటిలాగే విద్యార్థుల ఖాతాలో వసతి దీవెన పథకం కింద డబ్బులు జమకానున్నాయి. కాకపోతే ఈ ఏడాది వసతి దీవెన కింద నగదు వద్దనుకునే వారికి, ప్రత్యామ్నాయంగా ల్యాప్ ట్యాప్ లను విద్యార్థులకు అందజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ల్యాప్ ట్యాప్ లను ఎందుకు ఇస్తున్నారు అంటే, ప్రస్తుతం కరోనా సమయంలో చాలా వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది పిల్లలు ల్యాప్ ట్యాప్ లు, సెల్ ఫోన్ లు లేని పరిస్థితులలో ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నారు.

ఇక ఇలాంటి వారి కోసమే ప్రతి సంవత్సరం అమ్మ ఒడి కింద ఇచ్చే 15 వేల రూపాయలకి  ప్రత్యామ్నాయంగా, ల్యాప్ ట్యాప్ లను  ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు  ఇంటర్మీడియట్ విద్యార్థులకు అమ్మ ఒడి ఇవ్వడం జరిగింది. ఇకపై ఉన్నత విద్యా శాఖ అనగా డిగ్రీ , పీజీ, ఫార్మసీ తదితర ఉన్నత స్థాయి కోర్సులు చదివే విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పించనున్నారు. ఎవరైతే వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్నారో  అలాంటి వారు అందరూ ఈ పథకానికి అర్హులు.


ఇక ఎవరైతే ల్యాప్ ట్యాప్  వద్ద అనుకుంటున్నారో, అలాంటి వారికి ఎప్పటిలాగే 15 వేల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇక ఈ నిర్ణయం కూడా విద్యార్థుల పైనే ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ వసతి దీవెన కింద మూడు సంవత్సరాల వారంటి కలిగిన రెండు రకాల ల్యాప్టాప్లను జారీ చేయడం జరిగింది . ఇందులో విద్యార్థులు తమకు నచ్చిన ల్యాప్ ట్యాప్ ను  ఎంచుకునే అవకాశం కూడా ఆ విద్యార్థులకే ఇవ్వడం గమనార్హం.. ఇందులో బేసిక్ ల్యాప్ ట్యాప్ ఒకటి, అడ్వాన్స్డ్ ల్యాప్ ట్యాప్ కూడా ఒకటి.


మరింత సమాచారం తెలుసుకోండి: