ప్రస్తుతం డబ్బులు దాచుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక అందుకే ఆర్థికంగా మెరుగుపడిన వారి నుంచి.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశించేవారు కూడా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా సరి కొత్త పథకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన పథకంలో పొదుపు చేయడం వల్ల ఎక్కువ డబ్బు పొందడంతో పాటు ఎటువంటి టాక్స్ కూడా ఉండదు. పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు పైగా రిస్క్ ఉండదు ఇక ఎలాంటి పథకాలలో అయినా సరే డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ప్రజలు సైతం వెనుకడుగు వేయడం లేదు .

సరికొత్త పథకం కూడా అలాంటిదే అని చెప్పాలి.. ఎందుకంటే ఇందులో ఎటువంటి రిస్క్ ఉండకపోగా టాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది..కాబట్టి కేవలం రోజుకు 70 రూపాయలు ఆదా చేసుకుంటే నిర్ణీత గడువు ముగిసే సరికి రూ.1,50,000 మీ చేతికి వస్తాయి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఏమిటి ..? ఈ పథకం వల్ల ప్రజలు ఎలా లబ్ధి పొందుతారు..?  అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన రికరింగ్ డిపాజిట్ స్కీం ప్రజలకు మంచి లాభాలను ఆర్జించి పెడుతోంది. ఈ పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన రికరింగ్ డిపాజిట్ పథకం లో మీ పేరు పైన లేదా మీ పిల్లల పేరు పైన కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. నిర్ణీత కాలం కేవలం ఐదు సంవత్సరాలు కాబట్టి ఎవరైనా సరే సులభంగా ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వీలు ఉంటుంది.. ఇప్పటికే ఈ స్కీమ్ ద్వారా కేవలం ఐదు సంవత్సరాల లోనే లక్షల రూపాయలను పొందినవారు కూడా చాలామంది ఉన్నారు. వడ్డీ 5.8 శాతం ఈ పథకం ద్వారా మీరు పొందవచ్చు. కాబట్టి ప్రతి నెల రూ.2,100 చొప్పున ఆదా చేస్తే.. ఐదు సంవత్సరాల తర్వాత రూ.1.5 లక్షలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: