కాలంతో సంబంధం లేకుండా పెరిగిపోతున్న డిమాండ్ కి తగ్గట్టుగా డబ్బు విలువ రోజురోజుకు పెరుగుతోందని చెప్పాలి . తాగే నీటి నుంచి కాలేకట్టి వరకు ప్రతి ఒక్క పనికి డబ్బు చాలా అవసరం. అందుకే రూపాయి పెట్టుబడి పెడితే ఇంకో రూపాయి రావాలని ఆలోచించేవారు ఎక్కువ అవుతున్నారు. అయితే పెట్టిన దానికంటే ఎక్కువ మొత్తంలో రావాలి అంటే స్టాక్ మార్కెట్లో మాత్రమే అందుకు సులభయిన మార్గం అని అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ పథకాలు కూడా మీకోసం మంచి లాభాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పెట్టడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ లాభం రావడంతో పాటు నష్టం కూడా ఉండదు. ముఖ్యంగా మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించడంతో పాటు వడ్డీ కూడా లభిస్తుంది..


ఇక పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకాలలో మంత్లీ ఇన్కమ్ పథకం ద్వారా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే మీరు ప్రతి నెల ఎంత పెన్షన్ పొందాలి అనుకుంటున్నారో  ముందుగా నిర్ణయించుకొని ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే వడ్డీతో పాటు ప్రతి నెల పెన్షన్ మీరు పొందవచ్చు. ఇక ఈ స్కీం యొక్క మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరలు కాగా.. ఒకే సారి ఖాతాలో మీరు రూ. 4.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇక ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతినెల 5000 రూపాయలను పొందే అవకాశం ఉంటుంది. ఇక ఖాతా తెరిచిన రోజు నుంచి ప్రతి నెల చివరిలో మీరు పెట్టిన పెట్టుబడికి వడ్డీ కూడా లభిస్తుంది. ఇక ఈ స్కీం ద్వారా వడ్డీతో కలుపుకొని మీరు ప్రతి సంవత్సరం రూ.59,400 పొందవచ్చు. ఇక ఇందులో మీకు 6.6 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది పోస్టల్ శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: