బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాఘాట్ బంధన్ పార్టీ కూటమి చాలా ఘోరంగా ఓడిపోయింది. 243 సీట్లకు గాను 202 స్థానాలలో ఎన్డీఏ కూటమి విజయం అందుకోగా, MGB కేవలం 33 స్థానాలకే పరిమితమైంది. అయితే రాఘోపూర్ నియోజవర్గం నుంచి బరిలోకి దిగిన RJD నేత తేజస్వి యాదవ్ గెలిచారు. అక్కడ బిజెపి అభ్యర్థి సతీష్ కుమార్ పై 14,500 ఓట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. అయితే ఓట్ల ఎక్కింపు విషయంలో తేజస్వి యాదవ్ ఒక రౌండ్లో సుమారుగా 5000 ఓట్ల తేడాతో వెనుకంజలో పడడంతో నేతలు కార్యకర్తలు కూడా డీలపడ్డారు.


దీంతో తేజస్వి యాదవ్ నిలబడిన నియోజకవర్గం నుంచి గెలుస్తారా ?లేదా అనే ఉత్కంఠ అంతా కూడా పెరిగిపోయింది. అయితే చివరికి తేజస్విని యాదవ్ మాత్రం అక్కడ విజయాన్ని అందుకున్నారు. ఓట్ల లెక్కింపు జరిగిన సమయంలో  ఉదయం 11:30  గంటలకు సతీష్ కుమార్ తేజస్వి పైన 3 వేల ఓట్ల ఆదిత్యంలోనే ఉన్నారు. అలా నెమ్మదిగా తేజస్వి యాదవ్ ఓట్లు పుంజుకుంటూ మధ్యాహ్నం 12:20 సమయంలో 128 ఓట్ల తేడాతో తేజస్వి ఆదిత్యంలోకి వచ్చారు.. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే సతీష్ 343 ఓట్ల మెజారిటీతో ముందుకు వెళ్లారు. అలా ఒకటి రెండు స్థానాలలో ఈ నేతలు తారుమారు అవుతూ వచ్చారు. కాని చివరికి మాత్రం తేజస్వి యాదవ్ 14,532 ఓట్ల తేడాతో గెలవడంతో కార్యకర్తలు నేతలు ఊపిరి పీల్చుకున్నారు



ఓట్ల లెక్కింపులో RJD నేతకు చెమటలు పట్టించిన సతీష్ యాదవ్ 15 ఏళ్ల క్రితమే అదే నియోజకవర్గంలో తేజస్వి తల్లి, మాజీ సీఎం రబ్రిదేవిని ఓడించారట అంతేకాకుండా గతంలో ఆర్జేది పార్టీలోనే ఈ నేత ఉండేవారని తెలుస్తోంది. ఆ తర్వాత బిజెపి పార్టీలోకి వెళ్లిపోయి 2017 ఎన్నికల సమయంలో లాలు భార్య రబ్రి ను 13 ఓట్లకు పైగా మెజారిటీతో ఆమె పైన గెలిచారు. మొత్తానికి ఎన్డీఏ కూడా బీహార్ లో ఒక ప్రభంజనం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: