గత కొంత కాలం గా ఏఐ టెక్నాలజీ ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఏఐ టెక్నాలజీ వచ్చాక అనేక పనులు సులభతరం అయ్యాయి. దానితో ఏఐ టెక్నాలజీ ని వాడడంలో ప్రపంచం అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తుంది. ఇకపోతే అనేక పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ టెక్నాలజీ వాడి తమ పనిని ఎంతో సులభతరం చూసుకుంటున్నాయి. ఇక ఏఐ టెక్నాలజీ వల్ల పెద్ద పెద్ద కంపెనీల ఆర్థిక భారం కూడా చాలా వరకు తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా ఏఐ టెక్నాలజీ వాళ్ళ ఓ దేశంలో ఓ అమ్మాయి ఏకంగా పెళ్లి కూడా చేసుకుంది. అసలు ఏం జరిగింది అనే విషయాల్లోకి వెళితే ... జపాన్ దేశం కు సంబంధించిన 32 ఏళ్ల అమ్మాయి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) టెక్నాలజీ సహాయంతో తయారు చేసిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. జపాన్ కు సంబంధించిన ఓ అమ్మాయి తనకు ఎలాంటి అబ్బాయి కావాలి , ఆ అబ్బాయికి ఎలాంటి కళ్ళు ఉండాలి , ఎలాంటి మొఖం ఉండాలి , ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలి , ఇలా అన్నింటినీ డిజైన్ చేసుకొని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ తో ఒక అబ్బాయిని తయారు చేసుకుందట. ఆ తర్వాత నిరంతరం దానితో మాట్లాడి , తనను బాగా అర్థం చేసుకునేది ఇదే అని చెప్పి దానిని కలుస్ అనే పేరును కూడా పెట్టి వివాహం చేసుకుందట.

ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి తనకు పెళ్లి అయిపోయినట్లు తనకు తానుగా ప్రకటించుకుంది. ఇలా జపాన్ కు సంబంధించిన అమ్మాయి ఏఐ  "ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్" టెక్నాలజీ సహాయంతో తనకు ఎలాంటి అబ్బాయి కావాలో అలాంటి అబ్బాయిని తయారు చేసుకొని తనతో చాలా కాలం పాటు మాట్లాడి తనను అర్థం చేసుకునేవాడు ఇతనే అని చెప్పి అతని తోనే వివాహం చేసుకున్నట్లు ఆమె ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bn