రెండో సెంటిమెంట్‌గా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గత పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు. మూడో సెంటిమెంట్‌గా మాగంటి కుటుంబానికి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న వ్యవస్థాగత ఓటు బ్యాంక్‌ను నమ్ముకున్నారు. ఈ మూడు సెంటిమెంట్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోయినా పోటీలో మాగంటి సునీత బలహీనంగా కనబడలేదు. కొన్ని ప్రాంతాల వరకు గట్టిపోటీయే ఇచ్చారు. లేకపోతే కాంగ్రెస్ మెజార్టీ ఇంకా పెరిగిపోయేది ఉండేది. మరోవైపు కాంగ్రెస్ రెండు ప్రధాన సెంటిమెంట్లతో ప్రచారం సాగించింది. మొదటిది ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు.
ఏదేమైనా అమలు కాకుండా ఉన్న గ్యారెంటీలపై ప్రజలు ప్రశ్నించినా, ప్రభుత్వ పథకాలు ఇచ్చిన నమ్మకంతో ముందుకు సాగారు. రెండో సెంటిమెంట్‌గా నవీన్ యాదవ్ వరుస పరాజయాలపై ప్రజలతో ఓపెన్‌గా మాట్లాడారు. 2014 నుండి ఎన్నిసార్లు పోటీ చేసినా ఓటమి పాలయ్యానని, ఈసారి ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలనే భావోద్వేగాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఇది ఓటర్లను బాగా ఆకట్టుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
చివరి మూడు రోజుల ప్రచారం ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసిందని అంచనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్ రంగంలోకి దిగడం, బలమైన మాటలతో బీజేపీ–బీఆర్‌ఎస్‌లపై దాడి చేయడం, మంత్రుల బృందం సమన్వయంతో పనిచేయడం ఇవన్నీ నవీన్ యాదవ్ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ఇక బీఆర్‌ఎస్ వైపు చూసితే… మాగంటి సునీత కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా ఆమె సొసైటీ వివాదాలు, ఆమె బావ వజ్రనాథ్, ఆమె అత్త మాగంటి మహాదేవి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో నెగటివ్ ఇంపాక్ట్ కలిగించాయని పరిశీలకుల అభిప్రాయం. ఇవన్నీ కలిపి ఆమె ఓటమికి కారణమయ్యాయి. మొత్తం చూస్తే… సెంటిమెంట్ రాజకీయాలు రెండు పార్టీల్లోనూ ఉన్నా, ప్రజలు చివరికి స్పష్టత, నాయకత్వం, మరియు సమన్వయంతో సాగిన ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి