ఈ పేలుడు దాటికి పోలీస్ స్టేషన్లో ఉన్న వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపోయిపడ్డాయట. పోలీస్ స్టేషన్ నుంచి సుమారుగా 300 అడుగుల దూరంలో శరీర భాగాలు గుర్తించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఈ బాంబు బ్లాస్టు దాడిలో గాయపడిన వారి పరిస్థితి కూడా విషయంగానే ఉందంటూ తెలుపుతున్నారు. ఈ ఘటన పైన పోలీసులు రెండు కోణాలలో దర్యాప్తు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తు జరిగిందా? లేకపోతే ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే కోణాలలో పరిశీలిస్తున్నారు. ఉగ్రవాద మాడ్యూల్ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆ పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 360 కిలోల స్టాక్ పోలీస్ స్టేషన్లో ఉంచారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఫోరెన్సిక్ ల్యాబ్ కి కొంత పంపించినట్లు సమాచారం.
ఇటీవల దొరికిన ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ పేలుడు వల్ల పోలీస్ స్టేషన్ భవనం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిందని. ఈ బ్లాస్ట్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్ ఆవరణంలో పెద్ద ఎత్తున మంటలు చెల్లారేగాయి ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో కూడా అన్ని రికార్డ్ అయ్యాయని అధికారులు తెలుపుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సైతం ఆ సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికీ జరగరాని నష్టం జరిగిపోయింది. దీని వెనుక ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్నదనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి