బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనమైన క్లీన్ స్వీప్ చేసింది. ఇరవై ఏళ్లుగా పాలన కొనసాగుతున్నా.. వ్యతిరేకత లేకుండా.. పెద్ద సంచలనాలు లేకుండా బిహార్ ప్రజలు మళ్లీ నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిగా ఎన్నిక చేశారు. ఆసక్తికరంగా, ఒకసారి పార్లమెంట్ ఎన్నికల ఫలితం తేడాగా వచ్చినప్పుడు ఆయన పదవిలో నుంచి తప్పుకున్నారు. జితన్ రామ్ మాంఝీకి అవకాశం ఇచ్చారు.. కానీ అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో తిరిగి సీఎం పదవికి వచ్చేసారు. ఆ ఒక్కసారి తప్ప మరీ మిగిలిన కాలంలో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీహార్‌లో నితీష్ ప్రభుత్వానికి ఓపికతో శాంతిభద్రతల పరంగా కొంత విజయాలు కనిపించాయి. కానీ అభివృద్ధి పరంగా ప్రజలు ఇంకా పెద్ద మార్పును చూడలేదని, చాలా మంది వలస వెళ్లి ఇతర రాష్ట్రాల్లో పనులు చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అయినా, ప్రజాస్ధాయిలో విశ్వసనీయత ఉన్న నేతగా ఆయన మీద ప్రజల విశ్వాసం నిలిచింది.
గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాలుగు - ఐదు సీట్లు మెజార్టీకి కాస్తే మించి సాధించగలిగినా , ఈసారి ఆ ఊహించని మార్పు జరిగింది. 200 కి పైగా అసెంబ్లీ సీట్లు సాధించడం. ఇది రాజకీయ విశ్లేషకులకూ, ప్రత్యర్థి పార్టీలకూ కలలో కూడా ఊహించని విజయం అయ్యింది. ఎన్డీఏ ఓడిపోతుందని భావించిన వారు కూడా ఈ ఘన విజయం చూసి ఆశ్చర్యపోయారు. బీహార్ రాజకీయాల్లో కుల సమీకరణం కీలకంగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ, కూటమి పార్టీల్లో ఈ సమీకరణ హైలెట్ అయ్యింది. బీజేపీకి ఉన్న అగ్రవర్ణాల మద్దతు, నితీష్ పైన ఎబిసి / ఈబీసీ మద్దతు, ఎల్‌జేపీకి దళితుల మద్దతు ఇవన్నీ కలిసి సంపూర్ణ విజయాన్ని కట్టిపడేసింది. ఈ ఎలక్టోరల్ వ్యూహం మరియు సమీకరణం స్థాయిగా చూస్తే, బీహార్ లో ఈ ఎన్నిక విజయం పోలిటికల్ స్టడీగా మార్పిడి అయినట్టు విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి