ప్రముఖ దిగ్గజ ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డిఎఫ్సి తాజాగా తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లకు అలాగే రెన్యువల్ చేసుకునే ఫిక్స్ డిపాజిట్ లకు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని గుర్తించుకోవాలి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉన్న ఫిక్స్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్ల పెంపు అమలులోకి వచ్చింది.

వడ్డీ రేట్లు పెంపు నేపథ్యంలో కస్టమర్లకు ఇప్పుడు 4.5శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్స్ కైతే 5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఏడు రోజుల నుంచి పదేళ్ల టెన్యూర్ కి ఇది వర్తిస్తుంది. అలాగే 29 రోజుల వరకు ఫిక్స్ డిపాజిట్లు చేస్తే 4.5 శాతం వడ్డీ రేటు ఉంటుంది.  హెచ్డిఎఫ్సి బ్యాంకులో 30 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లు పై 5.25 శాతం వడ్డీ రేట్లు లభిస్తాయి.  అలాగే 60 రోజుల ఫిక్స్ డిపాజిట్ లపై 5.5 శాతం అలాగే 89 రోజుల ఫిక్స్ డిపాజిట్ లపై 5. 75% ఉంది.

ఆరు నెలల ఫిక్స్డ్ డిపాజిట్ లపై 6.25 శాతం అలాగే తొమ్మిది నెలల ఫిక్స్డ్ డిపాజిట్ లపై 6.65 శాతం వడ్డీ అందిస్తున్నారు. 15 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ లపై 6.75  శాతం అలాగే రెండు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ లపై 7.15% వడ్డీని నిర్ణయించింది . ఈ మేర చూస్తే సీనియర్ సిటిజన్ లకు  కూడా అదనంగా వడ్డీ రేటు లభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: