రవితేజ కొత్త సినిమాపై నిర్మాత కోనేరు సత్యనారాయణ భారీ బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. హిందీ సినిమా ధూమ్ లో ఉన్నట్టు భారీ ఛేజ్ లు, యాక్షన్ సీన్స్ తో దర్శకుడు రమేష్ వర్మ రవితేజతో ఓ సినిమా తీయబోతున్నాడు. దాదాపుగా విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. దీంతో ఆ సినిమా బడ్జెట్ ఊహించని విధంగా పెరిగిపోయిందని, అయినా కూడా నిర్మాత వెనకాడ్డం లేదని తెలుస్తోంది.