నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి లుక్ బయటకి వచ్చింది.. హీరోయిన్ పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ టీమ్ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ట్రైన్ లో కూర్చుని ఎవరితోనో నవ్వుతు మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఈ పిక్ క్యూట్ గా ఉంది. గ్రీన్ డ్రెస్ లో పూజా మెరిసిపోతోంది. ఎదురుగా ఉన్నది ప్రభాస్ లాగే కనిపిస్తున్నా కొంచెం కూడా రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు.