అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీని సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నారు నిర్మాతలు. ఈమేరకు పోస్టర్స్ కూడా బైటకొచ్చేశాయి. అయితే అనుకోకుండా ఈ సినిమాకి గట్టి పోటీ వచ్చింది. అది కూడా సొంత అన్న ద్వారా అఖిల్ కి పోటీ వచ్చి పడింది. నాగచైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ మూవీ కూడా సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. అరకొర థియేటర్లతో అన్నాదమ్ములిద్దరూ ఫైట్ చేసుకోవాల్సిందే.