వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కల్యాణ్ కు గబ్బర్ సింగ్ ఓ బ్రేక్ ఇచ్చింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా అప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న శృతి హాసన్ ని తీసుకోవడం విశేషం. అప్పటికే శృతిపై ఐరన్ లెగ్ అనే ముద్రవేసింది ఇండస్ట్రీ. కానీ పవన్ మాత్రం ఎలాంటి సెంటిమెంట్ పెట్టుకోకుండా ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమాతో హిట్ కొట్టారు. అక్కడికే ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయింది. ఆ తర్వాత మరోసారి శృతికి అవకాశమిచ్చినా పెద్ద షాక్ కొట్టింది. కాటమరాయుడు సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు పవన్ కల్యాణ్.