బంధాలు విడిపోయినా.. మనసులు మాత్రం కలిసే ఉన్నాయంటూ బాలీవుడ్ జంటలు రుజువు చేస్తూనే ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ మలైకా అరోరా. భర్త అర్బాజ్ ఖాన్ తో విడిపోయినా కూడా ఆయనతో, ఆయన కుటుంబంతో మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తోంది మలైకా. అదే సమయంలో తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో లివిన్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తోంది. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా తన మాజీ భర్త కుటుంబాన్ని కలిసేందుకు మలైకా వెళ్లొస్తుందట. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల మలైకా తన మాజీ భర్తకు సంబంధించిన ఓ బిజినెస్ ని ప్రమోట్ చేయడమే ఇప్పుడు విశేషంగా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో తన మాజీ భర్త మామిడి పండ్ల బిజినెస్ కి మంచి ప్రచారం కల్పించింది మలైక్ ఆరోరా.