యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలపైనే పూర్తిగా తన సమయాన్ని కేటాయిస్తున్నాడు. RRR త్వరలో రిలీజ్ అవుతున్నందున కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలు కాబోతుంది. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం గురించి ప్రేక్షకుల మధ్య చర్చలు మీద చర్చలు జరుగుతున్నాయట.