ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న దర్శకుడు రాజమౌళి. ఈ అపజయం ఎరుగని దర్శకుడు ప్రభాస్ తో ఓ భారీ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా ఎంపికయినట్లు తెలుస్తోంది. చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కే తన కొత్త సినిమాలో ‘అరుంధతి’ సినిమాతో సినీ అభిమానుల హృదయాల్లో మంచి గుర్తింపు తెచుకున్న అనుష్క సరిగ్గా సరిపోతుందని రాజమౌళి భావిస్తున్నట్లు సన్నిహితులు చెపుతున్నారు.
నిజానికి అనుష్క సినిమా కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది రాజమౌళి అని చెప్పుకోవాలి. సూపర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన అనుష్క తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా అశించిన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అయితే రాజమౌళి రూపొందించిన విక్రమార్కుడుతో మంచి బ్రేక్ సంపాదించుకుంది. తరువాత ‘అరుంధతి’తో అందరి హృదయాలను అధిష్టించింది.
అలాగే గతంలో ప్రబాస్ తో బిల్లా సినిమాలో నటించిన అనుష్క, తాజాగా మిర్చి సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు తాజాగా రాజమౌళి సినిమాతో ప్రభాస్ తో మూడవ సారి నటించనుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: