జనతా గ్యారేజ్ సినిమా హిట్ లో కీలకంగా మారిన కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ స్పూఫ్ తో ఇప్పుడు అల్లరి నరేష్ సినిమా రాబోతుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో సత్యం పాత్రలో నటించిన మోహన్ లాల్ పాత్రలో ఆయన మాత్రమే చేయగలరు అన్న రీతిలో చేశాడు. అయితే ఇప్పుడు ఆ క్యారక్టర్ స్పూఫ్ తో ఆలి భజన్ లాల్ గా రాబోతున్నాడు.

 

కొద్దిరోజులుగా హిట్ సినిమా కోసం దండయాత్రం చేస్తున్న అల్లరోడు ప్రస్తుతం జి.నాగేశ్వర రెడ్డి డైరక్షన్లో ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా చేస్తున్నాడు. బివిఎసెన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భజన్ లాల్ గా ఆలి నటిస్తున్నాడు. ఇక ఆ పాత్రకు మోహన్ లాల్ జనతా గ్యారేజ్ లో కనిపించిన లుక్ తోనే దర్శనమిస్తాడట ఆలి. అయితే సినిమా మీద అంచనాలను పెంచేందుకు ఆలి ఫోటో తన ట్విట్టర్లో పెట్టాడు.

 

సినిమాలో క్యారక్టర్ పేరు భజన్ లాల్ అని పెట్టారట. అయితే ఇదో రకంగా జనతా టీం పై సెటైర్ వేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మోహన్ లా గురించి సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మోహన్ లాల్ గురించి భజన చేస్తుండటం చూస్తున్నాం అయితే ఇప్పుడు అదే తరహాలో మోహన్ లాల్ పాత్రను భజన్ లాల్ గా పెట్టి జూనియర్ కు షాక్ ఇచ్చారు అల్లరి నరేష్ చిత్రయూనిట్.

 

షూటింగ్ కంప్లీట్ కావొచ్చిన ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టేయడం ఖాయం అంటున్నాడట అల్లరి నరేష్. ఇక దర్శకుడిగా మంచి ఫాంలో ఉన్న నాగేశ్వర రెడ్డి కూడా సినిమా హిట్ కు కావాల్సిన యాస్పెక్ట్స్ అన్ని ఉండేలా చూస్తున్నాడు. ఇప్పటికే ఈడోరకం ఆడోరకం తో హిట్ అందుకుని ఆటాడుకుందాం రా ఫ్లాప్ చవిచూసిన నాగేశ్వర రెడ్డి ఇంట్లో దెయ్యం నాకేం భయ్యంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: