టాలీవుడ్ అందగాడు మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ తమ సినిమాలో అన్నిటితో పాటు ముద్దులు ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. లిప్ టు లిప్ కిస్ చేయడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. నాని, అతడు, బిజినెస్ మేన్, దూకుడు చిత్రాల్లో నాయికల పెదవులను చుంబించాడు మహేష్. అల్లు అర్జున్ కూడా మహేష్ బాటలో నడుస్తున్నాడు. వేదంలో దీక్షాసేథ్, వరుడు లో భానుశ్రీ మెహ్రాలను వదిలిపెట్టలేదు బన్నీ. తాజా చిత్రం జులాయిలోనూ అతను ఇలియానా పెదవులను ముద్దాడి ఉంటాడని టాలీవుడ్ గాసిప్. ఏదేమైనా బాలీవుడ్ ముద్దు కల్చర్ టాలీవుడ్ లోకీ ప్రవేశిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి