మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమా రాజా ది గ్రేట్‌. ఎప్పుడో బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ర‌వితేజ చేసిన ఈ సినిమా శుక్ర‌వారం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ త‌ర్వాత సినిమాకు  U/A స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో పాటు ప‌టాస్ - సుప్రీమ్ లాంటి వ‌రుస హిట్లో జోరు మీదున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో రాజా ది గ్రేట్‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

raja the great movie కోసం చిత్ర ఫలితం

ర‌వితేజ పూర్తి స్థాయి అంధుడిగా చేస్తోన్న ఈ సినిమా కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. ఇప్ప‌టికే టీజర్, ట్రైలర్ల‌తో మంచి పాజిటివ్ బజ్ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 18న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో మెహ్రీన్ ప్రిజాద హీరోయిన్ గా నటించింది. సాయి కార్తీక్ సంగీతం అందించారు.


టాక్ ఎలా ఉందంటే...
సినిమా చూసిన సెన్సార్ బోర్డు స‌భ్యులు మంచి క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాజా ది గ్రేట్ నిలిచే అవ‌కాశాలున్న‌ట్టు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక అంధుడిగా ర‌వితేజ జీవించాడ‌ని కూడా సెన్సార్ టీం కితాబుఇచ్చింది. సినిమాకు దిల్ రాజు - వ‌రుస హిట్ల‌తో ఉన్న మెహ్రిన్‌, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో పాటు సీనియ‌ర్ న‌టి రాధిక లాంటి వాళ్లు ప్ల‌స్ కానున్నారు. మ‌రి రాజాగా ర‌వితేజ ఏం చేస్తాడో ఈ నెల 18న తేలిపోనుంది.

raja the great movie కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: