ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘మీ టూ ’ ఉద్యమానికి సంబంధించిన టాక్ నడుస్తుంది.  ఈ నేపథ్యంలో సెలబ్రెటీలే కాదు..సామాన్య మహిళలు కూడా తమ పట్ల జరుగుతున్న..జరిగిన లైంగిక దాడుల గురించి మీడియా ముందుకు వచ్చి బహిరంగంగానే చెబుతున్నారు. మరికొంత మంది సోషల్ మాద్యమాల ద్వారా తెలుపుతున్నారు.  తాజాగా సొంత ఇళ్లల్లో కూడా బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతాయన్నారు సింగర్ సునితా సారథి.  ఇండస్ట్రీలోనే కాదు ఇతర సంస్థల్లో కూడా ఆడవాళ్లు లైంగిక ఇబ్బందులు పడుతున్నారని..అప్పుడు నాకు నాలుగైదేళ్లుంటాయి.
Image result for singer sunitha saradhi
మా అమ్మ వాళ్ల సోదరుడు తరచుగా మా ఇంటికి వచ్చేవాడు. వచ్చిన ప్రతీసారి బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి ముద్దులుపెట్టి, అసభ్యంగా తాకుతూ వేధించాడు. కొన్ని నెలలపాటు ఇలా జరిగింది.  అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు..అందరూ ముద్దుకోసం చేస్తున్నారని భావించే వారు.   కొంత కాలం తర్వాత ఆ వ్యక్తి అసలు స్వరూం తెలిసింది.  ఈ క్రమంలో కొన్నేళ్ల తర్వాత మా అమ్మ సహోద్యోగి, స్నేహితుడు నన్ను వేధించాడు. మా ఇంటికి రాగానే నన్ను ఎత్తుకుని ఆడించినట్లు చేసి వికృత చేష్టలకు పాల్పడేవాడు.
Related image
ఓ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆ అంకుల్ నన్ను దగ్గరికి లాక్కుని లిప్‌లాక్ ఇచ్చేశాడు. వదిలించుకునేందుకు చూస్తుండగా నా ముఖంపై ముద్దులు పెడుతూ రాక్షసానందం పొందాడు. వెంటనే బాత్రూమ్‌కు వెళ్లి డెటాల్‌తో నోరు కడిగేసుకున్నా. ఇలా నా జీవితంలో రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.   నేను సింగర్ నే కానీ నాకు చిన్మయి స్నేహితురాలు కాదు. కానీ ఆమెకు జరిగిన చేదు అనుభవాలు నాకు కూడా జరిగాయి.

నాకే కాదు..చాలా మంది అమ్మాయిలకు చిన్న నాటి నుంచి ఇలాంటి వేధింపులు జరుగుతూనే ఉంటాయి..కానీ బయట పెట్టుకోలేరు.  . నిజం నిర్భయంగా మాట్లాడాలి. వెకిలిగా ప్రవర్తించే వాళ్లకు భయపడవద్దు. మానవ మృగాలను కాపాడవద్దు. మగవాళ్లు కూడా మాకు మద్దతు తెలిపితే నీచులకు శిక్ష పడేలా చేయవచ్చునంటూ సింగర్ సునితా సారథి పోస్ట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: