సాహో సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది.  టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం విశేషం.  ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.  సాహో బిజినెస్ చేసుకోవడానికి ఈ టీజర్ మంచి ఉపయోగం కూడా.  ఒకప్పుడు సినిమా చూసి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనేవారు.  


ఇప్పుడు అలా కాదు.  సినిమా రాక ముందే .. హీరోకున్న మార్కెట్ దృష్ట్యా కొనేస్తున్నారు.  ప్రభాస్ సాహో సినిమా కూడా ఇంచుమించుగా అలాంటిదే.  సాహో సినిమా ఓవర్శిస్ రైట్స్ ను రూ.42 కోట్లకు ఫార్ ఎంటెర్టైనేమేంట్ సంస్థ ఆఫర్ చేసింది.  ఒకరకంగా చెప్పాలి అంటే ఇది చాలా ఎక్కువ.  


బాహుబలి తరువాత వస్తున్న సినిమా కాబట్టి ఆ మొత్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.  దీంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాకు 67 కోట్ల రూపాయలు ఇచ్చి సొంతం చేసుకోవాలని చూస్తోంది ఫార్ సంస్థ.  అంటే రెండింటికి కలిపి 109 కోట్లు.  రెండు సినిమాలకు డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 


అయితే, ఫార్ సంస్థ ఇచ్చిన ఆఫర్ నచ్చలేదేమో లేదంటే మరేదైనా కారణంతో తెలియదుగాని, ఈ డీల్ కు యూవీ, డివివి దానయ్యలు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.  ఈరోజు ఈ డీల్ కు సంబంధిన అధికారికంగా వార్త వస్తుందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: