బాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదన్నా ఉందంటే అది కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి విషయమే. తన పెళ్లి విషయంలో ఎప్పుడూ మాట్లాడని సల్మాన్ ఖాన్ ని అదే విషయం మీద అందరూ టార్గెట్ చేసి వార్తల్లో ఉండేట్టు చేస్తారు. ఇప్పుడు ఆ బాధ్యతను బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తీసుకుంది. 'బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తనను పెళ్లి చేసుకోబోతున్నార'ని షాకింగ్‌ న్యూస్ చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది.  

 

 

 

ఓ ఇంగ్లీష్ మీడియాకు జరీన్ ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంలో ఓ విలేఖరి.. ఫన్నీ క్వశ్చన్ అంటూ టెస్ట్ పెట్టాడు. ‘మీపై మీరే ఓ రూమర్‌ సృష్టించుకుని.. అది వైరల్‌ అయిపోవడానికి ఏం చేస్తారు’ అంటూ ప్రశ్నించాడు. జరీన్‌ వెంటనే..  ‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు' అని చెప్పింది. ఈ జవాబుతో అక్కడున్నవారు తెరుకునేలోపు.. ' ఇలాంటి రూమర్స్‌ చాలా ఫన్నీగా ఉంటాయి. కానీ.. నాకు పెళ్లిపై నమ్మకం లేదు. పెళ్లి ఓ జోక్‌ అయిపోయింది’  అంటూ సెలవిచ్చింది. వీరిద్దరూ జోడీగా ‘వీర్‌’ చిత్రంలో నటించారు. ఈ చిత్రంతోనే జరీన్‌ ఖాన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యింది. ఇప్పుడీ వార్త బాలీవుడ్ నూ, ఇంటర్నెట్ నూ షేక్ చేస్తోంది.

 

 

 

సల్మాన్ సినిమాల్లోకి వచ్చి 30 ఏళ్ళవుతోంది. 50ఏళ్ల వయసులో ఉండి కూడా నిత్యం తన పెళ్లి టాపిక్ ను వార్తల్లో ఉంచగలిగే స్టార్ స్టేటస్ అతని సొంతం. ఐశ్వర్యారాయ్ తో పీకల్లోతు ప్రేమ పెళ్లి వరకూ వెళ్లలేకపోయింది. తర్వాత రొమేనియకు చెందిన లులియా వంతుర్ అనే మోడల్ తో రిలేషన్ ఉందని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ హాట్.. కత్రినాకైఫ్ తో ఎఫైర్ దేశమంతా మోగిపోయింది. మరి సల్మాన్ పెళ్లి టాపిక్ మరెన్నాళ్లు నడుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: