మరో మూడు రోజులలో విడుదల కాబోతున్న ‘సాహో’ దేశంలోని అనేక భాషలలో ఒకేసారి విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ప్రభాస్ మీడియాకు అర్ధ రాత్రి కూడ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈబిజీ వల్ల ఏర్పడ్డ టెన్షన్ తో తనకు సరిగ్గా తినాలని కూడ అనిపించడం లేదనీ ‘సాహో’ రిజల్ట్ తెలిశాక కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళి పోవాలని ఉంది అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు. 

తనకు నేషనల్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘బాహుబలి’ విడుదల కాబోతున్న ‘సాహో’ ల మధ్య తేడాను వివరిస్తూ ప్రభాస్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘బాహుబలి’ తో పోల్చుకుంటే ‘సాహో’ లో తాను పడ్డ కష్టం చాల తక్కువ అని ఈ సినిమా అంతా స్క్రీన్ ప్లే ఆధారంతో నడుస్తుంది కాబట్టి ‘బాహుబలి’ కోసం తనను రాజమౌళి పెట్టినంత నరకం ‘సాహో’ కోసం సుజిత్ పెట్టలేదు అంటూ సెటైర్లు వేశాడు. 

అయితే ‘బాహుబలి’ రిజల్ట్ గురించి తానెప్పుడు టెన్షన్ పడలేదనీ ‘సాహో’ గురించి మాత్రం తాను తిండి కూడ తినకుండా టెన్షన్ పడుతున్న వివరాలను నవ్వుతూ వివరించాడు. వాస్తవానికి తనకు ఏర్పడ్డ ఈ నేషనల్ స్టార్ ఇమేజ్ చూసి తనకు వస్తున్న ఆశ్చర్యాన్ని వివరిస్తూ ‘ఈశ్వర్’ సినిమా చేస్తున్నప్పుడు అసలు తనను నటుడుగా జనం ఒప్పుకుంటారా అంటూ తాను పడ్డ టెన్షన్ ను వివరిస్తూ తన లాంటి సాధారణ వ్యక్తి నేషనల్ స్టార్ గా మారిపోవడం తనకు కలగా అనిపిస్తోంది అంటూ జోక్ చేసాడు. 

తన కంటే ఎన్నో విజయాలు సాదించిన రాజమౌళి చిరంజీవి రజినీకాంత్ లను చూసినప్పుడల్లా వాళ్ళ ఇమేజ్ ముందు తాను ఒక మరుగుజ్జులా కనిపిస్తాను అంటూ ప్రభాస్ ఎటువంటి ఇగో లేకుండా అందరివాడుగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను ఇన్ని సినిమాలలో నటించినప్పటికీ యాక్షన్ రొమాంటిక్ సీన్స్ లో నటించాలి అంటే తనకు చాల సిగ్గుతో పాటు భయం కూడ కలుగుతుందని డబ్బులు తీసుకున్నాను కాబట్టి కెమెరా ఆన్ అయిన తరువాత తన భయాలను వదిలేస్తాను అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: