ప్రభాస్.. బాహుబలితో ఆలిండియా స్టార్ అయ్యాడు.. ఒన్ ఫిల్మ్ వండర్ లా మిగిలిపోకుండా మళ్లీ సాహోతో కూడా ఆలిండియా లెవల్లో మెరిశాడు.. సాహో కు డివైడ్ టాక్ వచ్చినా.. మొత్తం మీద వారం రోజుల్లో 400 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరున్న ప్రభాస్ అంటే అమ్మాయిలు పడిచస్తారన్న సంగతి తెలిసిందే.


ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ప్రభాస్ అంటే ఇష్టం అని బహిరంగంగానే ప్రకటించేశారు. ఇక విజయ్ దేవరకొండ మరో యువ సంచలనం.. పెళ్లి చూపులతో ఆకర్షించి.. అర్జున్ రెడ్డితో అదరగొట్టి .. గీత గోవిందంతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశాడు.. నోటా, డియర్ కామ్రెడ్ వంటివి అంతగా ఆకట్టుకోకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం ఓరేంజ్ లో ఉంది.


మరి ఈ ఇద్దరిలో ఎవరు హాట్.. ఈ ప్రశ్నకు సమాధానం పాయల్ రాజ్ పుత్ వంటి ఓ కుర్ర హీరోయిన్ ను అడిగితే ఏం చెబుతుంది. ఈ భామ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు ఆన్సర్ చెప్పింది. ప్రభాస్.. విజయ్ దేవరకొండలో ఎవరు హాట్ గా ఉంటారు అని పాయల్ ను విలేఖరులు అడిగితే.. ఆమె ఏమాత్రం సంకోచించకుండా .. తడుముకోకుండా ప్రభాస్ పేరు చెప్పేసింది.


కేవలం పేరు మాత్రమే చెప్పకుండా.. అందుకు కారణం కూడా వివరించింది. ప్రభాస్ లో ఒక స్పార్క్ ఉంటుందట. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ లో ఉండే స్టైల్ యాటిట్యూడ్ ప్రత్యేకంగా ఉంటాయట. పాయల్ రాజ్ పుత్ అక్కడితో ఆగిందా.. తనకు ప్రభాస్ తో పని చేయాలని ఉందంటూ తన మనసులోని మాటను కూడా బైటపెట్టేసింది పాయల్ రాజ్ పుత్. అయితే ఇది కేవలం పాయల్ రాజ్ పుత్ ఫీలింగే లెండి.. విజయ్ అభిమానులు ఇందులో పెద్దగా ఫీలవ్వాల్సిందేమీ లేదు. ఒక్కొక్కరి ఒక్కొకరు నచ్చుతారు. అంతే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: