మెగా కుటుంబంలో హీరోల సంఖ్య ఒక క్రికెట్ టీమ్ సభ్యుల సంఖ్యకు చేరిపోవడంతో ఈ విషయంలో అల్లు కుటుంబం కూడ తమ రేంజ్ లో పోటీ ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లుగా కనిపిస్తోంది. తెలుస్తున్న సమాచారంమేరకు అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి ఫిలిం ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి ఇప్పటికే బాబి గీత ఆర్ట్స్ నిర్మించే సినిమాల నిర్మాణ విషయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తమ సంస్థ తరపున తీయబోయే సినిమాల వ్యవహారాలలో క్రియాత్మక శక్తిగా వ్యవహరిస్తున్నారు. అయితే సినిమా నిర్మాణం పై తన దృష్టి పెడుతూనే అవకాశం దొరికితే సినిమా ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటినుంచో బాబికి ఆలోచనలు ఉన్నట్లు టాక్.
కొద్దికాలం క్రితం అల్లు అర్జున్ నటించిన ఒక మూవీలో బాబి ఒక కీలక పాత్ర పోషించే ఆలోచనలు చేసినా ఆఖరి నిముషంలో ఆ ఆలోచనలు ఆచరణ రూపం దాల్చలేదు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ బాబి ఫిలిం ఎంట్రీకి సంబంధించిన వార్తలు ఊపు అందుకున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు వరుణ్ తేజ్ హీరోగా నిర్మాణం జరుపుకోబోతున్న లేటెస్ట్ మూవీలో బాబి ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు టాక్. బాక్సర్ గా నటించే ఈ మూవీని కిరణ్ కొర్రపాటి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో బాబి కనిపిస్తాడని సమాచారం.
గత కొద్ది రోజులుగా అల్లు బాబి భార్య నీలు షా బాబిని నటుడుగా మారమని అతడి పై ఒత్తిడి చేస్తున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. దీనితో బాబి ఆలోచనలు మారి ఇలా ఫిలిం ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు టాక్. నెగిటివ్ పాత్రల లుక్ కు బాగా సరిపోయే బాబి సక్సస్ అయితే అల్లు కాంపౌండ్ హీరోల మధ్య మంచి పోటీ పెరగడమే కాకుండా ఆ కుటుంబ హీరోల సంఖ్య 3కు పెరగబోతోంది. ఇక బన్నీ కొడుకు ఆయాన్ ఎంట్రీ మాత్రమే మిగిలి ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి