పవన్ కల్యాణ్ సినిమా అంటేనే ఓ రేంజ్ లో ఉంటుంది. ఆయన పవర్ స్టార్ గా తెలుగు సినీ అభిమానులు నీరాజనాలు అందుకున్నారు. మరి అలాంటి ఆ నటుడి సినిమాలో మరో సూపర్ స్టాటర్ నటిస్తే.. అందులోనూ విలన్ క్యారెక్టర్ వేస్తే.. ఇక ఆ సినిమా ఓ రేంజ్ లో అదరగొట్టడం కాయం కదా.. ఇంతకీ ఏ సినిమా.. ఏ సుపర్ స్టార్ పవర్ స్టార్ కు విలన్ గా నటిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఇది వర్కవుట్ అయ్యిన విషయం కాదు లెండి.

 

కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు విలన్ గా ఓ సినిమాలో మళయాల సూపర్ స్టార్ ను విలన్ గా నటింపజేయాలని అల్లు అరవింద్ అనుకున్నారట. కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే..” ఓసారి పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ఓ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించా. ఆయనకి ఫోన్‌ చేసి ఇలా ప్రతినాయక పాత్ర ఉంది చేస్తారా అని అడిగా.

 

దానికి ఆయన ‘ఇదే మాట చిరంజీవిని అడుగుతారా’ అని ప్రశ్నించారు. నేను ‘అడగలేను’ అన్నా. దాంతో ఆయన నవ్వుతూ పెట్టేశారు’’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు అరవింద్‌. ఇంతకీ ఈ ప్రస్తావన అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారా..? మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘మామాంగం’ అనే భారీ చరిత్రాత్మక చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా నాలుగు భాషల్లో డిసెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

 

దీన్ని తెలుగులో గీతా ఆర్ట్స్‌ సంస్థ విడుదల చేయబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుకలో మమ్ముట్టి గురించి మాట్లాడుతూ నిర్మాత అల్లు అరవింద్‌ కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ‘‘స్వాతికిరణం’ కోసం మమ్ముట్టిని తీసుకున్నప్పుడు.. అదేంటి ఓ మలయాళ నటుడిని తీసుకొస్తున్నారు, తెలుగు ప్రేక్షకులకు ఆయన పాత్ర కనెక్ట్‌ అవుతుందో లేదో అనుకున్నా. నిజానికి అప్పటికి ఆయన అంత పెద్ద నటుడని నాకు తెలియదు. కానీ, సినిమా థియేటర్లో చూసినప్పుడు కనీసం లేచి నిలబడలేకపోయా. అంత గొప్పగా నటించారాయన అంటూ అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: