తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరూ నీకెవ్వరూ.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మీక మందన్నా హిరోయిన్ గా నటిస్తున్నారు.. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కాబోతుంది.. కాగా ఈ చిత్రం హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు..
ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుండి బయటకి వచ్చిన టీజర్లు పోస్టర్లు పాటలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. అందుకే ఈ చిత్రం హిట్ పక్కా అని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటవరకూ ఈ చిత్రం నుండి వచ్చిన అన్ని సినిమాకు మంచి రెస్పాన్స్ ను అందించిన కూడా సినిమా ఎక్కడో భయం పట్టుకుంది.. ఎందుకంటే ఈ సినిమాతో పాటుగా పలు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి..
2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..అయితే ఈ సంక్రాంతికి సినిమాలా సందడి ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే.. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది.. ఇక పోతే తమిళ్ తలైవా రజినీ కాంత్ నటించిన దర్బార్ చిత్రం కూడా అప్పుడే విడుదల కాబోతుంది..అయినా కూడా మహేష్ వెనకడుగు వెయ్యకుండా సినిమా విడుదలకు సిద్ధపడుతున్నాడు..
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం తాజాగా సెన్సార్ గడప తొక్కింది.. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది ..సినిమా మొత్తాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీంతో ప్రమోషన్లో మరింత వేగాన్ని పెంచనుంది సరిలేరు టీమ్. ఇదిలా ఉంటే సెన్సార్ పూర్తి అయ్యిందంటూ విడుదల చేసిన పోస్టర్లలో రిలీజ్ డేట్ లేకపోవడం గమనర్హం.అయితే, సినిమా విడుదల తేదీ వాటర్ మార్క్ మాత్రం సెన్సార్ నుండి అందలేదు దీనితో సినిమా విడుదల అవుతుందా కాదా అని మహేష్ అభిమానులు ఆలోచనలో పడ్డారు.. మరి ఈ చిత్రం నుండి మరో అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి