ఎక్కడికి పోతావు చిన్నవాడా ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథాంశంతో సినిమాలను తెరకెక్కించి అందరిలా కాకుండా తనకంటూ ఒక భిన్నమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు విఐ  ఆనంద్... తన ఎనేర్జి  తో ప్రేక్షకుల్లో ఎనర్జీ పెంచుతూ ఎంతగానో అలరించిన హీరో రవితేజ.. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం డిస్కో రాజా. సైన్స్ ఫిక్షన్ సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి నుంచి రవితేజ అభిమానుల్లో  భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఇప్పటికే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విఐ ఆనంద్ డిస్కో రాజా సినిమాలో కూడా తన పనితనం చూపించాడు. సినిమా మొత్తం థ్రిలింగా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఆనంద్. 

 

 

 ఒక స్నో మౌంటెన్  లో పడిపోయి బ్రెయిన్ డెడ్ అయిన రవితేజని... అక్కడున్న కెమికల్ ల్యాబ్  వారు తీసుకువచ్చి ప్రయోగం చేస్తే రవితేజ బతుకుతాడు. అక్కడి నుంచి ఈ సినిమా మొదలవుతుంది. మొదటి నుంచి ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో అన్నింటిని సరైన పాళ్లలో రంగరించి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వీఐ ఆనంద్. ఈ సినిమా విషయంలో మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ సినిమాలో రవితేజ కామెడీ కూడా ఎక్కడ కొదవ లేదని చెప్పాలి. ఓవైపు డిస్కోరాజా పాత్రలో  ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ లు ఇస్తూనే మరోవైపు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు మాస్ మహారాజా రవితేజ. 

 

 

 మరోసారి తనదైన స్టైల్ నటన కామెడీ యాక్షన్ తో అదరగొట్టేశాడు. డిస్కో రాజా పాత్రని రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. మామూలుగా రవితేజ అనగానే వీర మాస్ పంచులు.. కామెడీ ఫైట్లు డాన్సులు కోరుకుంటారు అభిమానులు. ఈ సినిమాలో మాత్రం రవితేజ తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ కాస్త తక్కువగా ఉంటాయి. కానీ సినిమా థ్రిల్లింగ్ గా కథ  సాగి పోతూ ఉండడంతో ప్రేక్షకులకు అదంతా గుర్తు రాదు . కాగా ప్రస్తుతం ఆవరేజ్ టాక్ సొంతం చేసుకుని  ఈ సినిమా ముందుకు సాగుతోంది. ఇక ఈ సినిమాకు పోటీగా ఇప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు రిలీజ్ లేకపోవడంతో ఈ సినిమా మంచి కలెక్షన్లు రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ఈ సినిమా త్రిల్లింగ్ గా  ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగినప్పటికీ మాస్ మహారాజా స్టైల్ కామెడీ యాక్షన్ ఉంటే ఇంకా బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: