నిన్న విడుదల అయిన ‘అశ్వద్ధామ’ తో నాగశౌర్య తన అదృష్టం మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది అని భావించాడు. అయితే ఈ మూవీ నాగశౌర్య కు కంటే ఈ మూవీ ద్వారా విలన్ గా పరిచియం అయిన బెంగాలి స్టార్ జిషు సేన్ గుప్తా కెరియర్ కు బ్రేక్ ఇస్తుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్స్ కొరత ఉన్న విషయం తెలిసిందే. హీరోని డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ తో ఎవరూ హైలైట్ అవ్వలేకపోతున్నారు. ఈ లిస్టులో అరవింద్ స్వామి మాధవన్ లు పేర్లు ప్రముఖంగా ఉన్నప్పటికీ వారు అన్ని సినిమాలలోను నటించడానికి అంతగా ఆసక్తి కనపరచడం లేదు.
ఈ పరిస్థితుల నేపధ్యంలో ‘ఆశ్వద్ధామ’ మూవీలో విలన్ గా నటించిన జిషు సేన్ గుప్తా గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. తన మొదటి సినిమాతోనే మెప్పించడమే కాకుండా అతడు ఈ మూవీలో ప్రదర్శించిన స్టైలిష్ విలనిజమ్ చూసినవారు ఈ నటుడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరైతే ఇలాంటి వ్యక్తి ఒక టాప్ డైరెక్టర్ చేతిలో పడితే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ స్టైలిష్ విలన్ మారడం ఖాయం అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు.
దీనితో ఈ మూవీ చూసి వచ్చిన సగటు ప్రేక్షకుడు ఈ మూవీలోని నాగ శౌర్య గురించి కాకుండా ఎక్కువగా ఈ కొత్త విలన్ గురించి మాట్లాడుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అంతేకాదు ఈ మూవీలోని అతడి క్యారెక్టర్ చూసిన వాళ్ళు ‘ధృవ’ లోని అరవింద్ స్వామి గుర్తొచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బెంగాలి సినిమా రంగంలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఇతడు ఇప్పటి వరకు బెంగాలి హిందీ భాషలలో 90 కి పైగా సినిమాలలో నటించినట్లు తెలుస్తోంది. ‘అశ్వద్ధామ’ మూవీ విజయం ఎలా ఉన్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక స్టైలిష్ విలన్ ను పరిచయం చేసిన ఖ్యాతి నాగశౌర్య కు దక్కుతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి