పవర్ స్టార్ పవ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా 1996లో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అయన నటించిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించగా, ఆపై వచ్చిన తొలిప్రేమ పవన్ కు మంచి గుర్తింపునిచ్చింది. ఇక ఆ తరువాత బద్రి, ఖుషి విజయాలతో టాలీవుడ్ టాప్ స్టార్ గా మారిపోయిన పవన్, అక్కడి నుండి కొన్ని ఫ్లాప్స్ తో పాటు కొన్ని సక్సెస్ లు కూడా అందుకున్నారు. ఇక ఇటీవల అజ్ఞాతవాసి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్, కొద్దిరోజలు క్రితం తన తదుపరి సినిమాగా బాలీవుడ్ మూవీ పింక్, అధికారిక తెలుగు రీమేక్ లో ప్రస్తుతం నటిస్తున్నారు. 

 

అయితే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ విషయమై ఇప్పటికే కొన్ని విమర్శలు ప్రచారం అవుతునప్పటికీ పవన్ మాత్రం వాటిని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. మొదటగా నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్, ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఆమె నుండి విడిపోయారు. ఆపై బద్రి హీరోయిన్ రేణు దేశాయి ని ప్రేమించి వివాహమాడిన పవన్, ఇటీవల ఆమె నుండి కూడా విడిపోయి, రష్యన్ మోడల్ అన్న లెజెనోవా తో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ఎవరు ఎన్ని విధాలుగా పవన్ ని ప్రశ్నించినా, ఆయన మాత్రం తన పని తాను చేసుకుపోయారు. అయితే ప్రస్తుతం పవన్ విషయమై టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారం అవుతోంది. పవన్ వ్యక్తిగత విషయాలు ప్రక్కన పెడితే, 

 

ఆరేళ్ళ క్రితం ఆయన పాలిటిక్స్ అనే పెళ్ళాన్ని పెళ్లిని చేసుకుని, దాని ద్వారా కొద్దిపాటి విమర్శలు ఎదుర్కుంటూ ముందుకు సాగుతున్నారని, అలానే చాలా గ్యాప్ తరువాత మరొక పెళ్ళాం అయిన సినిమాలను కూడా ప్రస్తుతం తన అక్కున చేర్చుకున్న పవన్, ఈ ఇద్దరు పెళ్లాలతో ఎలా వేగుతారో ఏమో అంటూ కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కొందరు నటులు, అటు రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారని, కావున పవన్ కూడా ఆ రెండిటిని బ్యాలన్స్ చేస్తారనే నమ్మకం తమకు ఉందని అంటున్నారు ఆయన ఫ్యాన్స్ ......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: