రామ్ గోపాల్ వర్మ కు సెంటిమెంట్లు బంధాలు అనుభంధాలు ఆప్యాయతలు చాల తక్కువ దీనికితోడు ఆయన దేవుడు ని కూడ నమ్మడు. అయితే ఈ మధ్య కాలంలో వర్మ కు కొన్ని భయాలు పట్టుకున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. తన చివరి రోజుల్లో తనను ఎవరు చూస్తారు అంటూ వర్మ తన భయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా నే చెప్పి వర్మకు కూడ ఎమోషన్స్ ఉన్నాయా అన్న సందేహాలు వచ్చేలా చేసాడు.


ఇప్పుడు సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం తరువాత ఆ అత్యాచారం చేసిన నేరస్తుల పై జరిగిన ఎన్ కౌంటర్ పై ఒక సినిమాను తీయడానికి ప్రయత్నిస్తూ వర్మ బిజీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో వర్మకు విపరీతమైన ఆనందాన్ని భావోద్వేగాన్ని గురిచేసిన సంఘటన నిన్న జరిగింది. 


ప్రస్థుతం అమెరికాలో డాక్టర్ గా ఉంటున్న రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి తల్లి అయింది. ఆమెకు ఆడపిల్ల పుట్టింది అన్న విషయం నిన్న ఆదివారం తన అల్లుడు ద్వారా తెలుసుకున్న వర్మ విపరీతమైన ఆనందానికి లోనైనట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ విషయం పై అయినా వర్మ భావోద్వేగానికి లోనవ్వడు. అయితే దీనికి దీనికి భిన్నంగా విపరీతమైన ఆనందంతో భావోద్వేగానికి లోనవ్వడం వర్మ సన్నిహితులకు షాక్ ఇచ్చినట్లు సమాచారం. 


ఈ విషయం తెలుసుకుని కొందరు వర్మ సన్నిహితులు వర్మను పలకరించినప్పుడు ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ శక్తి తనను మార్చలేకపోయిందనీ అయితే తన మనవరాలు కోసం తాను మారవలసిన పరిస్థితులు వచ్చాయి అంటూ జోక్ చేసినట్లు సమాచారం. దీనితో బూతు సినిమాలు తీసే వర్మకు అతడి మనవరాలు జ్ఞానోదయం కలిగించి వర్మను మార్చి మళ్ళీ సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు తీసేలా అతడి మనవరాలు ప్రేరణ కలిగిస్తుందేమో చూడాలి. త్వరలో రామ్ గోపాల్ వర్మ తన మనవరాలని చూడటానికి అమెరికా వెళ్ళబోతున్నట్లు సమాచారం..   

మరింత సమాచారం తెలుసుకోండి: