ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల మధ్య ఎఫైర్ల అనేవి చాలా కామన్ అయిపోయింది. చాలా సందర్భాల్లో ఇందుకు సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. కానీ హీరోలు, హీరోయిన్లు తమ రిలేషన్ షిప్ వ్యవహారాల్ని బయట పెట్టేందుకు ఇష్టపడరు. సాధ్యమైనంత మేరకు మీడియాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ, అవి ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంటాయి. ఇలా రెడ్ హ్యాండెడెగా దొరికిపోయిన వారూ చాలా మందే ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. మేనకోడలుతోనే స్టార్ హీరో ఎఫైర్. ఆయనో టాలీవుడ్ స్టార్ హీరో.
టాలీవుడ్లో అమ్మాయిల కలల రాకుమారుడుగా, ఆగ్ర హీరోగా, మంచి నిర్మాతగా ఆయన దూసుకుపోతున్నాడు. ఈయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్దదే. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెలుగు చిత్రం పరిశ్రమలో అడుగుపెట్టాడీయన. ఇప్పటికే ఈయన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు మూడు దశాబ్దాలు కావొస్తుంది. అయిప్పటికీ ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో తిరుగులేని రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈయన కుటుంబం నుంచి మూడో తరం హీరోలు కూడా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. వారు కూడా ఓ రేంజ్లోనూ దూసుకుపోతున్నారు. అయితే ఈ స్టార్ హీరో సొంత మేనకోడలుతోనే ఎఫైర్ ఉన్నట్టు ఇండస్ట్రీ ఇన్నర్ సైడ్ వర్గాల్లో పుకార్లు షికార్డు చేస్తున్నాయి.
ఇక సదరు స్టార్ హీరో మేనకోడలు కూడా ఓ సినిమా ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. అయితే ఆ చిత్రం హిట్ అవ్వకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే చాలా కాలం తర్వాత ఇటీవల ఓ యంగ్ హీరో సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న స్పై క్యారెక్టర్లో నటించిందీమె. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు మేనమామతో ఎఫైర్ రూమర్స్ వల్ల ఈమె వైవాహిక జీవితం కూడా విఫలమైంది. అటు సదరు స్టార్ హీరో మేనకోడలుతోనే కాకుండా ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.