టాలీవుడ్ నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు, గడిచిన రెండేళ్లలో వరుసగా భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల సక్సెస్ లతో మంచి క్రేజ్ తో, మరింత గొప్ప మార్కెట్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. నిజానికి తన కెరీర్ బిగినింగ్ లో మీడియాకు దూరంగా వ్యవహరించిన మహేష్, ఆపై అభిమానులకు, మీడియా వారికి ఎప్పటికప్పుడు మరింత చేరువ అవుతూ తన సినీ, వ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే గడచిన నాలుగేళ్లలో భరత్ అనే నేను కంటే ముందు మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం, అనంతరం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాల్లో నటించడం జరిగింది. అప్పట్లో ఆ రెండు సినిమాలు భారీ హైప్ తో రిలీజ్ అయి, అతి పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. 

 

వరుసగా రెండు సినిమాలు పరాజయం పాలవడంతో కెరీర్ పరంగా బాగా డీలా పడ్డ మహేష్ బాబు, ఆ పై కొంత ఆలోచన చేసి తనకు గతంలో శ్రీమంతుడు వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కొరటాల శివకు మరొకసారి దర్శకుడిగా అవకాశం ఇచ్చి, భరత్ అనే నేను సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సూపర్ స్టార్ అత్యద్భుత నటనను కనబరచడంతో పాటు, దర్శకుడు శివ సినిమా యొక్క కథ కథనాలను ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా రిలీజ్ అయిన తొలి రోజు తొలి షోకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మహేష్ బాబు అమితానందంలో భార్య నమ్రతను ముద్దాడటం జరిగింది. అయితే అదే ఫోటోను ఆయన తన సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేయడం, ఆపై అది ఎంతో వైరల్ అవడం జరిగింది. 

 

తన సినిమా ఫెయిల్ అయితే మానసికంగా ఎంతో కృంగిపోయే మహేష్ బాబు, అదే తన సినిమా సక్సెస్ సాధించినట్లు అయితే ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటారని, ఇక రెండేళ్లుగా సక్సెస్ లేక కొంత సమస్యలు ఎదుర్కొన్న ఆయనకు ఒక్కసారిగా భరత్ అను నేను అద్భుత విజయాన్ని అందుకోవడంతో, పట్టరాని ఆనందంలో భార్యను ప్రేమతో ముద్దాడి, తన మనసులోని ఆనందాన్ని ఆమెతో ఆ విధంగా పంచుకున్నారని తెలుస్తోంది. అంతకుముందు వరకూ అక్కడక్కడ సినిమాల్లో మాత్రమే హీరోయిన్లతో లిప్ కిస్ సీన్లలో నటించిన మహేష్, ఆ విధంగా మొట్టమొదటిసారిగా తన భార్యను బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం జరిగింది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: