ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ తో యుద్దం చేయడానికి భారత జాతి యావత్తు తమ విభేదాలను విస్మరించి  జాతి కుల మతాలకు అతీతంగా పోరాటం చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధిని అరికట్టేందుకు  స్వీయ గృహ నిర్బంధం తప్పించి మరోమార్గం ఏమిలేదని చెప్పడంతో జనం తమకు తాముగా స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లి పోతున్నారు.   


ఇలాంటి పరిస్థితులలో దినసరి రోజువారీ వేతన కూలీలు ఉద్యోగులు తక్కువ జీతం కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంలో  పడిపోయింది. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు ప్రకటిస్తున్నా ఎంత వరకు ఈ పధకాలు వారి కష్టాలను తీరుస్తాయి అన్న విషయం పై సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో సమాజ చైతన్యం ఎక్కువగా ఉండే ప్రకాశ్ రాజ్ తన ఉద్యోగుల కోసం  సిబ్బంది కోసం చేప్పట్టిన కార్యక్రమం ఇండస్ట్రీలో ఇతర టాప్ స్టార్స్ కు ఒక కొత్త ఒరవడిని క్రేయేట్ చేసింది’. 


‘జనతా కర్ఫ్యూతో నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ... నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను’ అంటూ ప్రకాష్ రాజ్ ముందుగా తన వద్ద పని చేసే వారికి సహం చేస్తూ తన మంచి మనసును చాటుకున్నాడు. అంతేకాదు ప్రస్తుతం తానూ నటిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి షూటింగ్ ఆగిపోవడంతో ఆ ప్రొడక్షన్‌ హౌస్ లో దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి  ఆలోచిస్తున్నాను అని చెపుతూ ప్రకష్ రాజ్ షేర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు  ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 


‘మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే... మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని... జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది’ అంటూ ప్రకాష్ రాజ్ తాను చెప్పిన అబిప్రాయాన్ని ఇండస్ట్రీలోని అందరు ఆ చరించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: