ప్రస్తుతం హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సినిమాతో మంచి పేరుతో దూసుకెళ్తున్న యువ నటుడు విజయ్ దేవరకొండ. ముందుగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో ప్రారంభం అయిన విజయ్ మూవీ కెరీర్, ఆ తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం నుండి మెల్లగా ముందుకు సాగింది. ఇక ఆ తరువాత ఆయన స్నేహితుడైన తరుణ్ భాస్కర్ తొలిసారిగా విజయ్ ని హీరోగా పెట్టి పెళ్లి చూపులు సినిమా తీయడం జరిగింది. అప్పట్లో మంచి క్లాస్ హిట్ ని అందుకున్న పెళ్లి చూపులు తో హీరోగా విజయ్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. 

 

ఆపై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ నటించిన బోల్డ్ మూవీ అర్జున్ రెడ్డి సూపర్ హిట్ కొట్టి, యువత తో పాటు మాస్ ప్రేక్షకుల్లో కూడా విజయ్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అనంతరం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో విజయ్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు దక్కించుకున్నాడు. అయితే కేవలం సినిమాలే కాదు విజయ్ యొక్క యాటిట్యూడ్, మాట్లాడే విధానం కూడా ఆయనకు యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. 

 

ఏ విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా కుండా బద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటున్న విజయ్, ఇటీవల కరోనా బాధితుల కోసం తన వద్దనున్న రూ.1.30 కోట్లను విరాళంగా ప్రకటించడం జరిగింది. అయితే తనకు ఇంకొంత సపోర్ట్ కనుక ఉండి ఉంటే మరికొంతమందికి సాయం అందించేవాడినని  విజయ్ చెప్పిన మాటలతో అతడి స్థాయి మరింత పెరిగిందని వారు అంటున్నారు. ఆ విధంగా నిక్కచ్చిగా వ్యవహరించే అలవాటున్న విజయ్ పద్ధతులు కొందరికి నచ్చనప్పటికీ, మెజారిటీ వ్యక్తులు మాత్రం ఆ తరహా వారినే ఇష్టపడతారని, బహుశా ఆ పద్దతే అతడిని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లి నెంబర్ వన్ హీరోని చేసినా చేయవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: