తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా చేసే దర్శకుడు బోయపాటి.. అయితే బోయపాటి శ్రీను ఎంత మంది హీరోలతో సినిమాలు  తెరకెక్కించినప్పటికీ బాలకృష్ణతో సినిమా తెరకెక్కిస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది. ఎందుకంటే పవర్ ఫుల్ హీరోయిజానికి  పెట్టింది పేరు బాలకృష్ణ. అందుకే బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటే ఇండస్ట్రీ హిట్ అన్నట్లుగానే ఉంటుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహాలెజెండ్ సినిమాలు వచ్చి ఒక రేంజ్ లో విజయాన్ని సాధించాయి. ఇక ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. 

 

 గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలక్రిష్ణ... ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేక పోతున్నా బోయపాటి శ్రీను మళ్లీ తమ హిట్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి చూపెట్టాలి అనుకుంటున్నారు. అయితే బాలకృష్ణ బోయపాటి సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి చాలా వార్తలు వస్తూ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన వార్త బాలకృష్ణ బోయపాటి సినిమాలో బాలకృష్ణ  అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడని ఈ పాత్ర ఎంతో కీలకంగా మారిపోతుందని టాక్ వినిపించింది. 

 

 అంతేకాకుండా బాలకృష్ణ కూడా సరికొత్త గెటప్ లో  గుండుతో కనిపించడం కూడా ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది. ఇక తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. అఘోరా పాత్రలో  బాలయ్య తమ సినిమాలో  కనిపించబోతున్నాడు అని దర్శకుడు బోయపాటి శీను క్లారిటీ ఇచ్చారు. అఘోర పాత్రలో బాలయ్య ఎంతగానో బాగుంటాడని... బాలయ్య రోల్ ని కన్ఫామ్ చూసాడు బోయపాటి శ్రీను. దీంతో ఈ సినిమాపై మరింత ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అఘోర పాత్రలో బాలయ్య ఎలా నటించబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

మరింత సమాచారం తెలుసుకోండి: