తెలుగు వాళ్ళ గొప్పతనం తెలియాలంటే చరిత్రను చదవాలి .. తెలుగు అభిమానులు , ఆప్యాయతలు చూడాలంటే అలనాటి సినిమాలు ఒక్కసారి చూడాల్సిందే.. అప్పుడు తెలుగు జనం రొమ్ము చూపి నిలబడతాడు.. అయితే, తెలుగు సత్తా చాటిన సినిమాలు వందల సినిమాలు ఉన్నాయి.. కుటుంబ విలువలను.. ప్రేమలను , బంధాలను చూపించిన సినిమాలను అంటే ఎన్టీఆర్ , ఏ ఎన్నార్ ల వినిమాలే ఎక్కువగా గుర్తొస్తాయి.. 

 

 

 

 

 

 

 

అందుకే అప్పటి హీరోలకు సినిమాలకు ఇప్పటి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..అలనాటి హీరోలను మళ్లీ తెర మీద గుర్తు చేయాలని చాలా మంది అనుకోని వారు సినిమాలు జీవిత విశేషాలు తలపించేలా వారి గురించి బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే చాలా బయోపిక్ లు వచ్చిన ఆ సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ఇప్పుడు ఆ సినిమాలను మళ్లీ చూపించాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.. 

 

 

 

 

 

 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ లు హవా నడుస్తోంది.. స్టార్ హీరోల తో ఈ సినిమాలను తెరకెక్కించాలని అభిప్రాయపడుతున్నారు.. అసలు విషయానికొస్తే.. నందమూరి నట సింహం బాల కృష్ణ  స్వర్గీయ నటుడు తెలుగు దేశం స్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్ లను తెరకెక్కించాడు.  అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుల మన్ననలను అందుకోలేదు.. ఇప్పుడు ఏ ఎన్నార్ బయోపిక్ లను రూపొందించాలని ఆలోచనలు మొదలవుతాయి..

 

 

 

 

 

 

 

ఇప్పటివరకు నాగేశ్వర రావుకు సంబందించిన ఒక్క బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు..అయితే ప్రస్తుతం ఆయన బాల్యం నుంచి, సినిమాలలో అవకాశాలను ఎలా తెచ్చుకున్నారు.. అనే విషయాలను ఈ సినిమాలో చూపించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.. అయితే ఆ సినిమాలో హీరో గా ఇద్దరి పేర్లు వినపడుతున్నాయి.. ఒకరు సుమంత్, నాగచైతన్య.. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ సినిమా చేస్తే ఆయన సినిమా చూసినట్లే ఉంటుంది అంటూ అక్కినేని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.. మరి ఆ సినిమాలో ఎవరు నటిస్తారు అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: