టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఈ పేరుకు ఏ స్థాయిలో ఫాలోంగ్ ఉందో ఇప్పుడు ప్ర‌త్యేకంగా లెక్క‌లు అక్క‌ర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్నాడు ఈ నంద‌మూరి చిన్నోడు. డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటే తారక్.. తన మార్కెట్‌ను సైతం గణనీయంగా పెంచుకున్నాడు. అయితే ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ది బెస్ట్ సినిమాల లిస్ట్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన యమ‌దొంగ చిత్రం ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. 2007లో విడుదలైన ఒక సోషియో ఫాంటసీ తెలుగు సినిమా ఇది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YAMADONGA' target='_blank' title='yamadonga-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>yamadonga</a> to release in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> on Jan 3 ...

ప్రియమణి, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. స్టూడెంట్‌ నం.1, సింహాద్రి చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌- రాజమౌళి కాంబినేషన్‌లో వ‌చ్చిన య‌మ‌దొంగ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించింది.  గ్రాఫిక్స్‌ పరంగా దర్శకుడు రాజమౌళి ప్రతిభను వెలికితీసిన తొలి చిత్రమిది.యమలోకం నేపథ్యంలో మోహన్‌ బాబు, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YAMADONGA' target='_blank' title='yamadonga-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>yamadonga</a> to be released in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> ...

అందులో ముఖ్యంగా.. `ఏమంటివి ఏమంటివీ , జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువ? హ.., ఎంతమాట ఎంతమాట
ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్షా కాదే , కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఏ యందువ , నీ తండ్రి భరద్వాజుని జననమేట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమేట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా హహహ నిది ఎ కులమూ? అంటూ గుక్క తిప్పుకోకుండా ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్.. థియేటర్లలో ప్రేక్షకుల చేత‌ కేక‌లు పెట్టించింది. ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ మొత్తం సినిమాకే హైలెట్ అని చెప్పుకోవ‌చ్చు. ఇక ఈ సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అటు రాజ‌మౌళికి కూడా ఈ సినిమా భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: