ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో కుటుంబం మొత్తం కలిసి హాయిగా చూసి సరదాగా గడిపే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాలను ఫ్యామిలీ ముందు చూడడానికి యూత్ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఉంటున్నాయి సినిమాలు. కానీ ఇప్పటికీ కూడా స్టార్ హీరోలు ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాల ను తీస్తున్నారు. దాదాపుగా స్టార్ హీరో లు తీసిన ప్రతి సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది అనే విషయం తెలిసిందే. 

 

 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు నటించే సినిమాలో దాదాపుగా చాలా మటుకు ఫ్యామిలీ ఆడియన్స్ ని  అలరించేవి కావడం గమనార్హం. కానీ స్టార్ హీరోలు కూడా అప్పుడప్పుడు ఘాటైన రొమాన్స్ ఉన్న  సినిమాలలో నటిస్తూ ఉంటారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా శ్రీమంతుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 


 మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒక సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సమాజానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండే ఒక యువకుడు తన ఊరు ఒక పల్లెటూరు అని తెలుసుకుని అక్కడికి వెళ్లి ఊరిని బాగు చేయడానికి చేసే ప్రయత్నాలు... ఆ సమయంలో నే కలిగే ఇబ్బందులు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సినిమా లో ఎక్కడా వల్గారిటీ కనిపించదు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఒకచోట కూర్చొని హాయిగా ఈ సినిమా ను ఎంజాయ్ చేయొచ్చు అనడం లో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: