ఆర్య సినిమా నుండి రంగస్థలం వరకు తీసింది తక్కువ సినిమాలే అయినా సుకుమర్ సినిమా అంటే ఓ క్రేజ్ ఉంటుంది. ఇక రంగస్థలం హిట్ తో సుక్కు హిట్టు సినిమా రీ సౌండ్ ఇలా ఉంటుందని ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళంతో పాటుగా హింది భాషలో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఐటం సాంగ్ పెడుతున్నారట.

 

ఇక ఈ స్పెషల్ సాంగ్ లో మొదట్లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతులా చేస్తుందని అన్నారు. కాని అమ్మడు చేయనందో లేక రెమ్యునరేషన్ భారీగా అడిగిందో కాని లేటెస్ట్ గా సినిమాలో ఐటం సాంగ్ కోసం ఆరెక్స్ 100 భామ పాయల్ల్ రాజ్ పుత్ ను అడిగారట. బన్ని లాంటి స్టార్ హీరో ఆఫర్ అదీగాక నేషనల్ వైడ్ రిలీజ్ ఇంతకన్నా మంచి ఆఫర్ ఏదైనా ఉంటుందా చెప్పండి. అందుకే పాయల్ ఈ స్పెషల్ సాంగ్ కు సైన్ చేసిందట. 

 

సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ కు చాలా క్రేజ్ ఉంటుంది. ఆర్యలో అ అంటే అమలాపురం దగ్గర నుండి రంగషలంలో జిగేలు రాణి సాంగ్ వరకు సినిమాకు అవసరమైనప్పుడు కరెక్ట్ టైం కు వదిలే సాంగ్స్ అదిరిపోతాయి. మాస్ ఆడియెన్స్ ను మెప్పించేలా ఉండే ఈ సాంగ్స్ సుకుమార్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పొచ్చు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ ఈ ముగ్గురు కలిసి చేస్తే ఆ సినిమా ఆల్బం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా తన మ్యూజిక్ మోత మోగించేలా దేవి శ్రీ ప్రసాద్ బాగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: