మురళీధర్ గౌడ్ విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా రామాయణం పేటలో జన్మించారు. తన విద్యాభ్యాసాన్ని హైదరాబాదులో పూర్తిచేసి ఎలక్ట్రిసిటీ బోర్డులో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా కూడా పని చేశారు. అలా 27 ఏళ్ల పాటు పనిచేసిన మురళీధర్ 2012లో పదవీ విరమణ చేయగా, రిటైర్మెంట్ అనంతరం నటన పైన మక్కువ ఉండటంతో మెల్లగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అలా 2018లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం అనే చిత్రంలో ఒక చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చారు. ఈ పాత్ర తనకు బాగా పేరు తెచ్చేలా చేసింది.
ఆ తర్వాత డిజె టిల్లు సినిమాలో హీరోకి తండ్రి పాత్రలో ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్వించిన మురళీధర్ ఆ తర్వాత బలగం, మ్యాడ్, టిల్లు స్క్వేర్ , మంగళవారం తదితర చిత్రాలలో నటించారు. ఈ ఏడాది మురళీధర్ నటుడుగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఫంకీ, బరాబర్ ప్రేమిస్తా వంటి చిత్రాలలో కీలకమైన పాత్రలలో కనిపించారు. అలా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలలో కూడా అవకాశాలు సంపాదిస్తున్న సమయంలో మురళీధర్ భార్య మరణం ఆయనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నటుడు మురళీధర్ కూడా గతంలో తన భార్యతో కలిసి చాలానే ఇంటర్వ్యూలు ఇచ్చారు. మురళీధర్ భార్య శశికళ కూడా వార్డు మెంబర్ గా కూడా పనిచేసినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి