మార్చి 19న విడుదల కానున్న భారీ సినిమాల పోటీ నేపథ్యంలో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఆ రోజున సోలోగా విడుదల అవుతుందని భావించారు. అయితే తాజాగా రణవీర్ సింగ్  నటిస్తున్న ధురంధర్ 2 చిత్ర బృందం విడుదల తేదీపై స్పష్టత ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్చి 7న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్, సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ అనివార్యమైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ తేదీకి పెద్ద సినిమాలు మరేవీ విడుదల కాకపోవడం వల్ల ప్రారంభ వసూళ్ల పరంగా పవన్ కళ్యాణ్ సినిమాకు పెద్దగా ఇబ్బంది ఉండదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌కు ఉన్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ ఇమేజ్, అలాగే ఆయన సినిమాలకు వచ్చే భారీ ఓపెనింగ్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్ కు  మంచి స్టార్ట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారత ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న రణవీర్ సింగ్ సినిమా అయిన ధురంధర్ 2 అక్కడ మంచి ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ పోటీ ఆసక్తికరంగా మారబోతోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు అమెరికా వంటి మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే బాలీవుడ్ స్టార్ అయిన రణ్వీర్ సింగ్ నటించిన సినిమా కూడా అక్కడ ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉండటంతో రెండు చిత్రాలు బలమైన పోటీని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఈ రెండు సినిమాల ఓవర్సీస్ కలెక్షన్లు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చర్చకు వస్తోంది. ఈ పోటీలో మరో కీలక అంశం కూడా ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు ప్రత్యేక అనుమతులతో టికెట్ ధరలను పెంచితే, అది కొంతవరకు ధురంధర్  2కు పరోక్షంగా ప్లస్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. టికెట్ ధరలు అధికంగా ఉంటే సాధారణ ప్రేక్షకులు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కొంత వెనుకంజ వేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తక్కువ ధరలతో విడుదలయ్యే సినిమా వైపు కొంతమంది ప్రేక్షకులు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు మాస్ ఆడియన్స్ మాత్రం తమ అభిమాన హీరో సినిమా వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాస్ ఆడియన్స్ భారీగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలను ఆసక్తిగా చూస్తారు. అందువల్ల ప్రారంభ వసూళ్ల పరంగా ఉస్తాద్ భగత్ సింగ్ కు బలమైన ఓపెనింగ్స్ రావడం ఖాయం అనే అభిప్రాయం వినిపిస్తోంది. కొంతమంది అభిమానులు ఈ సినిమాకు ప్రస్తుతం ఉన్న హైప్‌ను ఈజీతో పోల్చుతూ మాట్లాడుతున్నా, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. మంచి ట్రైలర్, ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్ ఉంటే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగే అవకాశముంది.మొత్తంగా చూస్తే మార్చి 19న విడుదల కానున్న ఈ రెండు భారీ చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ ప్రేక్షకుల్లో మంచి ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, స్టార్ పవర్, ప్రమోషన్స్—అల్ల్ కలిసివస్తే ఈ రెండు సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అయితే చివరికి ప్రేక్షకుల తీర్పే అసలు విజేతను నిర్ణయించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: