మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో `విక్రమార్కుడు` ముందు వరసలో ఉంటుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటించగా.. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. 2006 లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది ఈ చిత్రం. అటు ఆడియన్స్ ని అలరించే సత్తిబాబు కామెడీ పాత్రతో పాటు మాస్ కి గూస్ బంప్స్ తెప్పించే విక్రం రాథోడ్ పాత్రలోనూ రవితేజ అసమాన నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

ముఖ్యంగా ‘చావు అంటే బయపడటానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకు అనుకున్నావారా రాథోడ్ విక్రమ్ రాథోడ్’, `పోలీసోడు ట్రాన్స్‌ఫర్ అయితే పోలీస్ స్టేషన్‌కే వెళతాడు పోస్టాఫీస్‌కు కాదు` అంటూ రవితేజ పలికే పవర్‌ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించాయి. అటు కీరవాణి అందించిన పాటలు కూడా సినిమా హిట్ అవ్వడానికి తోడ్పడ్డాయి. బాక్సాఫీస్ దగ్గర అప్పటికీ వేడి తగ్గని మహేష్ పోకిరి ని మాస్ ప్రభంజనం ముందు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపి 19 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

ఇలాంటి విక్రమార్కుడు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయగా.. అక్కడ సైతం ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. `రౌడీ రాథోడ్` పేరుతో 2012లో విడుదలైన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా మరియు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. రావితేజ మాదిరిగానే అక్షయ్ కుమార్ కూడా.. యాక్షన్, కామెడీని సమపాళ్లలలో అందించి ఆద్యంతం కడుపుబ్బ నవ్వించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి