సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆల్ ఇండియా రికార్డు నెలకొల్పాడు.. త్వరలో ఆయన జన్మదినం ఉన్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ కోసం మహేశ్ బాబు బర్త్ డే సీడీపీని ట్విట్టర్‌లో శనివారం అందుబాటులో ఉంచారు. ఈ కామన్ డీపీ ఇప్పుడు ఏకంగా ఆల్ ఇండియా రికార్డు కొట్టేసి మహేశ్ బాబు స్టామినా ఏంటో చూపించేసింది.
24 గంటల్లో 3.1 కోట్ల ట్వీట్లతో ఈ మహేశ్ బాబు కామన్ డీపీ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రెండ్ ను క్రియేట్ చేసేసింది. మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్స్ బలం, సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కు నిదర్శంగా ఈ రికార్డును చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని సినీదర్శకుడు బీఏ రాజు తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు.
India's Biggest Trend Ever with 𝟯.𝟭 Crores Tweets in 24 Hours!! #MaheshBabuBdayCDP 🔥
— BARaju (@baraju_SuperHit) July 26, 2020
Superstar @urstrulyMahesh#SSMB #MaheshBabu pic.twitter.com/HhM9tkgEHq
ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే.. కామన్ డీపీ అందుబాటులోకి తీసుకురావడం ఓ ట్రెండ్ గా మారింది. తమ అభిమాన నటుడి ఫోటోను డీపీగా పెట్టుకోవడం ఫ్యాన్స్ కు కూడా ఓ క్రేజ్ గా మారిపోయింది.
Top 3 Biggest Trends In India
— Thyview (@Thyview) July 26, 2020
👉#MaheshBabuBdayCDP - 31.1M
👉 #AdvanceHBDPawanKalyan - 27.3M
👉 #HappyBirthdayNTR - 21.5M
Super Fans at 1st Place 🔥
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత బాలయ్యల పుట్టిన రోజుకు ముందు కూడా ఈ కామన్ డీపీ సందడి కొనసాగింది. అలా తమ అభిమాన నటుల డీపీలను పెట్టుకోవడం ఫ్యాన్స్ కు అదో సరదా మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి