10 ఇయర్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన చిరు రీ ఎంట్రీ తర్వాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. తనయుడు నిర్మాతగా మారడంతో నిన్నటిదాకా సొంత బ్యానర్ అనుకున్న గీతా ఆర్ట్స్ ఇప్పుడు బయట బ్యానర్ అయ్యిందా అని అందరు అనుకుంటున్నారు. మూడు సినిమాల్లో ఏది గీతా ఆర్ట్స్ తో సంబంధం లేదు.. ఇక రాబోయే సినిమాలకు సంబంధించి కూడా చిరు బర్త్ డే నాడు ఎనౌన్స్ చేస్తారని అనుకుంటే అది జరగలేదు.
ఒకవేళ గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా కన్ఫర్మ్ అయితే తప్పకుండా మొన్న చిరు బర్త్ డే రోజు ప్రకటించి ఉండేవారని అంటున్నారు. సో మెగాస్టార్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. అయితే సరైన కాంబినేషన్ కుదరకనే అల్లు అరవింద్ తో చిరు సినిమా ఫిక్స్ అవట్లేదని అంటున్నారు. పేరుకి కొణిదెల ప్రొడక్షన్ అని పెట్టినా ఆ సినిమా నిర్మాతగా చరణ్ కు కావాల్సిన సహకారం మేనమామ అల్లు అరవింద్ అందిస్తున్నాడని అంటున్నారు. ఏదైనా గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా వస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి