కరోనా లాక్ డౌన్ తో  తో షూటింగ్ లు ఆగిపోయి, బోల్డంత ఫ్రీ టైమ్ దొరికింది హీరోలకు. కానీ ఎంత లీజర్ టైమ్ దొరికినా కుర్రాళ్లు మాత్రం రెస్ట్ తీసుకోవడం లేదు. మళ్ళీ షూటింగ్ లు స్టార్ట్ అయ్యేలోపు కొత్త లుక్ తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు. నో వీకెండ్స్, నో చీటింగ్ డేస్ అని కసరత్తులు చేస్తున్నారు.

సందీప్ కిషన్ ఎంత ప్రయత్నం చేసినా బాక్సాఫీస్ ఇంప్రెస్ కావడం లేదు. దీంతో ఇక లాభం లేదనుకొని బాక్సాఫీస్ ని కుమ్మేయ్యడానికి కండలు పెంచాడు. షూటింగ్స్ షురూ కాగానే గట్టి పంచ్ లు విసరాలని, కసరత్తులు చేశాడు. 'ఏ వన్ ఎక్స్ ప్రెస్' సినిమా కోసం సిక్స్ ప్యాక్ బిల్డ్ చేశాడు. కొన్నిరోజులుగా ఈ మజిల్డ్ బాడీ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

విజయ్ దేవరకొండ ఎప్పుడూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. లుక్ నుంచి మొదలుపెడితే స్టోరీ వరకు ఏదో చేయాలని ఆరాటపడుతుంటాడు. ఈ ఆరాటానికి పూరీ జగన్నాథ్  తోడవ్వడంతో భారీ మార్షల్ ఆర్ట్ మూవీ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించడానికి ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు రౌడీ. షూటింగ్ లో మధ్యలో వచ్చిన ఈ లాక్ డౌన్ ని ఎఫెక్టివ్ గా వాడుకుంటూ, కండలు పెంచాడు విజయ్. రీసెంట్ గా ఈ హీరో పోస్ట్ చేసిన షర్ట్ లెస్ ఫోటోస్ సోషల్ మీడియాలో చిన్న పాటి సునామి సృష్టించాయి.

థ్రిల్లర్స్ తో సూపర్ హిట్స్ కొడుతున్న అడివి శేష్ ఇప్పుడు ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో 'మేజర్' అనే సినిమా చేస్తున్నాడు. ముంబాయి 26 /11 దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథాంశంతో  తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇక క్యారెక్టర్ కోసం ఫిట్ నెస్ లెవల్స్ కూడా పెంచుకున్నాడు అడివి శేష్. వీళ్లు మాత్రమే కాదు కొంచెం బొద్దుగా ఉండే నారా రోహిత్ కూడా బరువు తగ్గాడు. నెక్ట్స్ సినిమాలో స్లిమ్ గా యూత్ హీరోగా కనిపించడానికి మేకోవర్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: